calender_icon.png 22 December, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

22-12-2024 02:49:07 PM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రూ.1.25 లక్షల ఎల్ఓసి అందజేత

పటాన్ చెరు,(విజయక్రాంతి): ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణానికి చెందిన ఠాకూర్ నరేందర్ సింగ్  ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో కృత్రిమ కాలు  కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కృత్రిమ కాలు కోసం మంజూరైన రూ. 1.25 లక్షల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఆదివారం ఎంఎల్ఏ నరేందర్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.