టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్, జనవరి 18 : ఆపద సమయంలో సీఎంఆర్‌ఎస్ ఆసరాగా నిలుస్తున్నదని టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ పొందడం ద్వారా ఎంతోమంది పేదలు ఆర్థికంగా ఉపశమనం పొందుతున్నారన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు మధుయాష్కీని సంప్రదించగా.. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఎల్బీనగర్ సద్గురు నగర్ కు చెందిన కె. కైలాశ్ (రూ.60వేలు), వనస్థలిపురం శ్రీరామ్ నగర్ కాలనీ చెందిన శక్తి రోహన్ (40,500), హయత్ నగర్ కు చెందిన షేక్ అశ్వక్ (25వేలు) , వనస్థలిపురం కు చెందిన లక్ష్మమ్మ (60వేలు)కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుట్ల నర్సింహ యాదవ్, కొండోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.