కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి భీమ్ భరత్
చేవెళ్ల, ఫిబ్రవరి 1: పేదలు సీఎం రిలీఫ్ ఫండ్ ను వినియోగించుకోవాలని కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జి పామెన భీమ్ భరత్ సూచించారు. షాబాద్ మండలానికి చెందిన పలువురు స్పీకర్ గడ్డం ప్రసాద్ చొరవతో సీఎంఆర్ ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా... 8 మందికి రూ. 4.52 లక్షల విలువైన చెక్కులు మంజూరయ్యాయి. వీటని శనివారం షాబాద్లోని పార్టీ ఆఫీసులో శనివారం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ సర్కారు పేదల పక్షపాతి అని, అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యానికి పెట్టపీట వేస్తోందని స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత లేని వారికి సీఎంఆర్ ఎఫ్ వరంలా మారిందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రామ్ రెడ్డి , మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింల , చెన్నయ్య , యూత్ కాంగ్రెస్ నాయకులు పెంట రెడ్డి , సురేందర్ రెడ్డి , షా బాద్ మాజీ సర్పంచ్ రవీందర్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీరామ్ రెడ్డి , అత్తర్ పాషా తదితరులు పాల్గొన్నారు.