calender_icon.png 3 October, 2024 | 8:40 PM

సీఎంఆర్‌ఎఫ్‌లో కోత లేకుండా వైద్య ఖర్చులు మొత్తం చెల్లించాలి

03-10-2024 06:35:15 PM

కరీంనగర్,(విజయక్రాంతి): మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సలు చేయించుకున్న నిరుపేదలందరికీ సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటిదని కొత్తపల్లి మాజీ వైస్ ఎంపిపి తిరుపతి నాయక్ అన్నారు. గురువారం మండలంలోని  చింతకుంట గ్రామంలో  దాదాపు 10 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కమలాకర్  ఆదేశాలు మేరకు మంజూరైన వారి ఇంటింటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాయక్ మాట్లాడుతూ... పేద ప్రజలు అనారోగ్యానికి గురై వైద్యం కోసం అనేక కష్టాలు పడి అప్పులు చేసి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం కోసం  ఇబ్బందులు అవుతున్న సందర్భంగా ప్రభుత్వమే వైద్యానికి అయిన ఖర్చులకు గాను కొంత సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చాలామంది ప్రజలకు ఈ పథకం తెలియక చేసిన అప్పులు తీర్చగా అనేక ఇబ్బందులు పడుతున్నారని  పథకాన్ని ప్రజలు తెలుసుకొని  ఎమ్మెల్యే ఆఫీస్ నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈసారి చింతకుంట గ్రామానికి 10 మంది ప్రజలకు దాదాపు 4 లక్షల వరకు చెక్కులు మంజూరు కావడం జరిగిందని, దీనికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.