calender_icon.png 23 December, 2024 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పేదలకు ఒక గొప్ప వరం..!

22-12-2024 08:05:37 PM

బాధితునికి సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ చెక్కును అందజేసిన పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ...

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్రాంగూడకి చెందిన బజరావు నర్స్ బాయి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో బాధితుడికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ మేరకు వైద్య చికిత్సకు సహకారం అందించిన పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీకి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, అనిల్, మహేందర్, చందు, తదితరులు పాల్గొన్నారు.