calender_icon.png 13 November, 2024 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ పేదలకు వరం

10-11-2024 06:19:27 PM

బాధితులకు సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేసిన పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3,18,000/- మూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు చెక్కు రూపేణా నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ మేరకు వైద్య చికిత్సకు సహకారం అందించిన పిఎసి చైర్మన్ అరేకపూడి గాంధీకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, దామోదర్ రెడ్డి, మంత్రి ప్రగడ సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.