calender_icon.png 20 April, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ చెక్కుల పంపిణీ

08-04-2025 12:52:12 AM

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన తొట్ల ప్రకాష్ కుమార్ గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా  సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ .42,000/- వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరంఅని ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పునరుద్గాటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి  నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తుందని   తెలియచేశారు.

పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయం అందిస్తుందని దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు. వైద్య చికిత్సకు సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు దళిత కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.