calender_icon.png 14 January, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

13-01-2025 06:35:35 PM

మందమర్రి (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రాంచందర్ కోరారు. మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన శెట్టి సుగుణకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులతో కలిసి సొమవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బాధిత కుటుంబానికి అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కమల మనోహర్ రావు, ఆసంపల్లి రాజయ్య, సీనియర్ నాయకులు ఎండి అబ్బు, ఎగుడ రాయమల్లు పాల్గొన్నారు.