19-04-2025 01:49:15 AM
సూర్యాపేట, ఏప్రిల్ 18: భారతదేశంలో పేదల ఆరోగ్యానికి అత్యదిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, సిఎం ఆర్ ఎఫ్ పథకం పేదలకు వరమని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన సిఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు 15 మందికి రూ. 6 లక్షల 88 వేలకు సంబంధించిన చెక్కులను అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే రూ. 1 వెయ్యి కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను ఇచ్చిందని కానీ పది సంవత్సరాలలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.