calender_icon.png 1 April, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

29-03-2025 06:35:53 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని తాజా మాజీ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మాచినపల్లి మధిర గ్రామమైన శేరిల్లకు చెందిన దొంతి శంకరమ్మ రూ.25,500 సీఎంఆర్ఎఫ్ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.