కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ అన్నారు. శనివారం సాయంత్రం కామారెడ్డిలో 26 మంది లబ్దిదారులకు రూ.కోటి 60 లక్షలు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ఆలీ మాట్లాడుతూ... అనారోగ్యంతో అప్పుల పాలు అయిన వారికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు(CMRF Cheques) ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. పేదలకు సహయంగా, అండగా నియోజకవర్గ ప్రజల మంచిమాత్రమే కొరుకుంటామన్నారు. ఎల్‌వోసీ సరైన సమయంలో అందక ఎంతోమంది సరైన పత్రాల సమాయానికి అందక ఇబ్బంది పడుతున్నారు. సర్వే అనంతరం డిజిటల్ హెల్త్‌కార్డు అందించి పది లక్షల వరకు నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు. జనవరి 26 తరువాత ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్‌కార్డులు అర్హులకు అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీ చేసి చూపించామని, రైతుభరోసా త్వరలో అందిస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు,500 రూపాయల గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌మద్ది చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, మాజీ జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటి డైరెక్టర్లు వలపిశెట్టి లక్ష్మిరాజం, దోమకొండ శ్రీనివాస్‌లు తదితరులు పాల్గొన్నారు.