02-04-2025 08:02:05 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పురపాలక సంఘ పరిధిలోని 3వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు బుధవారం నాడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ... ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం సకాలంలో ఇంటింటికి తిరుగుతూ స్థానిక నాయకులు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం హర్షనీయమన్నారు.
కష్టకాలంలో పేదలకు అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ పథకం కింద సహకారం అందించడం వలన ఎంతోమంది నిస్సహాయులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆపత్కాలంలో ఉన్న వారిని సకాలంలో ఆదుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 3వ వార్డు అధ్యక్షులు తుకారం, మాజీ కోఆప్షన్ నెంబర్ మహమ్మద్ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజార్, మైనారిటీ పట్టణ ఉపాధ్యక్షులు మహమ్మద్ రషీద్, సాజదుల్ల, తబ్రేజ్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.