calender_icon.png 29 April, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

29-04-2025 12:51:37 PM

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్యాంప్ కార్యాలయం నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65, 66వ డివిజన్ల, హాసన్పర్తి మండల పరిధిలో గ్రామాలలో అనారోగ్యానికి గురైన వారు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. 63 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి  (సీఎంఆర్ఎఫ్) సుమారు రూ.23,03,500 చెక్కులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ... పేదలను అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు.అనారోగ్య కారణాలతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరఫున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తూ, అర్హులైన పేదలకు న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని వివరించారు. ఆరోగ్యశ్రీ పథకంను 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచామని, పార్టీలకు అతీతంగా ప్రతీ పేదవారికి సంక్షేమ పథకాలు అందజేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తుందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పని చేస్తోందని ఇది పేదల ప్రభుత్వమన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోస, సన్న వడ్లకు 500 బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గత  పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు రాజకీయాలకతీతంగా మద్దతు పలకాలని కోరారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి లోని సుధీర ప్రాంతాల నుంచి నా దగ్గరికి డబ్బులు ఖర్చు రాకుండా మీకు ఏ సమస్య ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 8096107107 నెంబర్ కి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.