calender_icon.png 22 March, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత

22-03-2025 01:33:49 AM

ఎల్బీనగర్, మార్చి 21 : ఆపద సమయంలో సీఎంఆర్‌ఎఫ్ ఆసరా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. చైతన్యపురి డివిజన్ లోని గణేశ్ పురి కాలనీ కి చెందిన గౌరవ్ గౌడ్(24) కొన్ని రోజులుగా వెన్నుముక సమస్యలతో బాధపడు తున్నాడు.

ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు  ఎమ్మెల్యే సుదీర్ రెడ్డిని సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే రూ. 2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్వోసీ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు