బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్...
చేగుంట (విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ అన్నారు. మండల పరిధిలోనీ నిరుపేదలు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన వల్లభపూర్ గ్రామనికి చెందిన బత్తుల్లా కొమురయ్య 30,000 వేల రూపాయలు చెక్కును దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశల అనుసారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ... ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అలాగే ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని అన్నారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. ఈ మేరకు వైద్య చికిత్సకు సహకారం అందించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, జనరల్ సెక్రటరీ ముజామిల్, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, అంచనూరి రాజేష్, యూత్, మండల అధ్యక్షులు మోహన్ నాయక్, నర్సింగ్ ఫిషర్ అధ్యక్షులు సుధాకర్, జానీ బహి, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.