calender_icon.png 12 April, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్

04-04-2025 09:51:18 PM

దౌల్తాబాద్: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామానికి చెందిన పోతరాజు స్వామికి రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.