calender_icon.png 10 January, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ వేగవంతం చేయాలి

03-01-2025 11:09:33 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్...

కామారెడ్డి (విజయక్రాంతి): సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం పాల్వంచ మండలం భవానీపేట్ గ్రామంలోని గాయతీ అగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎంఆర్ సరఫరా త్వరతగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యం, సరఫరా చేయాల్సిన బియ్యం వివరాలను పౌరసరఫరాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లును శుభ్రంగా ఉంచాలని మిల్లు యాజమానికి తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, తహసీల్దార్ లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.