calender_icon.png 30 October, 2024 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోగా సీఎంఆర్ రైస్ ఇవ్వాలి

30-10-2024 12:39:43 AM

  1. సన్నాల సేకరణలో అక్రమాలకు తావివ్వొద్దు  
  2. సన్న ధాన్యం మిల్లింగ్‌కు రూ.40, దొడ్డు ధాన్యంకు రూ.30 
  3. పౌరసరఫరాల శాఖ వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): ధాన్యం సేకరణకు ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం సిపారసు చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వం విడుదల చేసింది. మిల్ల్లర్ల కు ధాన్యం ఇచ్చే విషయంలో విధివిధానాలు రూపొందించినట్టు పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మిల్లర్ల గత ట్రాక్ రికార్డునుబట్టి బ్యాంక్ గ్యారెంటీలను నిర్ధారించింది. డిఫాల్ట్ లేని మిల్లర్ల్లకు 10 శాతం బ్యాంక్ గ్యారెంటీ కానీ, 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని.. సీఎంఆర్ చేసి ధాన్యం ఇవ్వని వాటికి 20 శాతం బ్యాంక్ గ్యారెంటీ కానీ, 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్, గతం లో 25 శాతం ఫెనాల్టీ వేసిన వాటికి 25 శా తం బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలని స్పష్టంచేసింది.

ఈసారి మిల్లింగ్ ఛార్జీలు పెంచు తున్నట్టు వెల్లడించింది. దొడ్డు రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.30, సన్నరకం ధాన్యంకు రూ.40 ఇస్తున్నట్టు వివరించింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా సీఎంఆర్ చేసి ఇస్తే ఛార్జీలు ఇస్తామని స్పష్టంచేసింది.

సన్నా ల  సేకరణలో అక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకు సిబ్బందికి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో శిక్షణ, ధాన్యం గుర్తించేందుకు  రెవెన్యూ డివిజన్ స్థాయి కమిటీలు వేస్తున్నట్టు పేర్కొంది. గోదాము ల్లో ధాన్యం నిల్వలు పారదర్శకంగా చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.