calender_icon.png 8 February, 2025 | 12:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎమ్మార్ ధాన్యాన్ని వెంటనే డెలివరీ చేయాలి:అదనపు కలెక్టర్

08-02-2025 12:57:18 AM

గద్వాల, ఫిబ్రవరి 7 ( విజయక్రాంతి ) : సి యం ర్ ధాన్యాన్ని వెంటనే డెలివరీ అయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మిల్లర్లకు ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి లో అయన చాంబర్ నందు ఖరీఫ్ 2024-25 ధాన్యం డెలివరీ పై  పాల్గొన్న 37 రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రతి రైస్ మిల్లులో నిలువ ఉంచిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి సరఫరా చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. సి ఎం ఆర్ రైస్ సమయానికి సరఫరా చేయడం ద్వారా పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే ఆహార భద్రతలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుందని ఆయన అన్నారు.

సన్న బియ్యాన్ని సమర్థవంతంగా డెలివరీ చేయాలని సూచించారు. ఖరీఫ్ 2024-25 పంటకు సంబంధించి ఇప్పటివరకు ఇవ్వని బ్యాంకు గ్యారెంటీ లను త్వరగా ఇవ్వాలన్నారు. ప్రతి రైస్ మిల్లులో నిలువ ఉంచిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని డి.టి. లకు సూచించారు. ఈ సమావేశంలో డిఎస్‌ఓ స్వామి కుమార్, జిల్లా మేనేజర్ విమల, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.