19-02-2025 12:33:55 AM
భద్రాద్రి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సీఎంపిఎఫ్ ను 2024 సంవత్సరం మార్చి వరకు అప్డేట్ చేసి,కాంట్రాక్ట్ కార్మికులందరికీ పాసుబుక్కులను ఇవ్వాలని,సీఎంపిఎఫ్ ను ఆన్లున్ చేయాలని,సీఎం పీఎఫ్ లో కాంట్రాక్ట్ కార్మికులకు లోన్ సౌకర్యం కల్పించాలని సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు సిఎంపీఎఫ్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం సీఎం పిఎఫ్ రీజియన్ కార్యాలయ రీజినల్ కమిషనర్ శ్రీమతి ఎం కనకమ్మ కు వినతిపత్రం అందజేశారు.ఈ ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు, కార్యక్రమంలో నాయకులు ఎం.చంద్రశేఖర్,సురేష్, సంజీవరావు, రమణ, వినోద్, ఏసు, వెంకటలక్ష్మి, వాసవి, శ్రీను, నిర్మల, శంకర్ తదితరులు పాల్గొన్నారు.