calender_icon.png 29 April, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియా ఆసుపత్రిని సందర్శించిన సీఎమ్ఓ

28-04-2025 10:51:27 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ఎప్పటికపుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని నూతన సీఎమ్ఓ డాక్టర్ కిరణ్ రాజ్(CMO Dr. Kiran Raj) అన్నారు. సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. డివైసీఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ తో కలిసి ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బంది, యూనియన్ నాయకులు ఆయనను సన్మానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎమ్ఓ కిరణ్ రాజ్ మాట్లాడారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సింగరేణి ఆసుపత్రులను ముందుకు తీసువెళ్లనున్నట్లు పేర్కొన్నారు. పలు  ఏరియాలో ఉన్న ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం,మెరుగైన వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఆసుపత్రిలో ఉద్యోగులు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, రోగులతో  ఫ్రెండ్లీ ట్రీట్మెంట్ అందించాలని సూచించారు.

మెడికల్ బోర్డు అవినీతిపై ఉక్కుపాదం

మెడికల్ బోర్డు అవినీతితో వైద్యులకు, ఉద్యోగులకు ఏమైనా సంబంధం ఉన్నట్లు ఉపేక్షించేది లేదని, వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై సింగరేణి విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిఘా ఉందని అన్నారు.