calender_icon.png 2 March, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి నర్సరీ కార్మికుల వేతనాలకై సీఎండి బలరాం ఆదేశాలు అమలు చేయాలి

01-03-2025 09:02:41 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి నర్సరీ కాంట్రాక్టు కార్మికులకు కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలను అందజేయాలని కోరుతూ శనివారం ఏరియా ఎస్ఓటు జిఎం డి శ్యామ్ సుందర్ కు వినతిపత్రం అందజేశారు. సెంట్రల్ జీవో ప్రకారం వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, సింగరేణిలో ఉచిత వైద్య సౌకర్యం, బ్యాంకుల ద్వారా వేతనాలు తదితర అంశాలకు సంబంధించి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాలను మణుగూరులో సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఐఎఫ్టియు ఆధ్వర్యంలో చేసిన పలు ఆందోళనలు, అభ్యర్థనల ఫలితంగా నర్సరీ కాంటాక్ట్ కార్మికులకు వేతనాల పెంపుతో పాటు సంక్షేమం కూడా అమలులోకి వచ్చిందని ఈ సందర్భంగా నాయకులు మంగలాల్ అన్నారు. కార్మికుల వినతిపై సానుకూలంగా స్పందించిన ఎండి బలరాంకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏరియా నర్సరీ కాంటాక్ట్ కార్మికులు ఆర్ లక్ష్మీ రేణుక, ఏ ఇందిరా, బి లక్ష్మి, ఎం సాయి దుర్గ దేవి ఎం, ఈ రాజేశ్వరి, ఎస్.కె షాహిన్, బి కుమారి తదితరులు పాల్గొన్నారు.