calender_icon.png 28 February, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాకుంభ్ ఓ అద్భుతం

28-02-2025 12:00:46 AM

మేళా నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు: హార్వర్డ్ ప్రొఫెసర్లు

గంగమ్మ ఒడికి బ్యాక్టీరియా చేరదని శాస్త్రవేత్తలే చెప్పారు: రవిశంకర్

కుంభమేళా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన సీఎం యోగి

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 27: నెలన్నర పాటు సాగిన మహాకుంభమేళా బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేళాను హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన టాప్ ప్రొఫెసర్లు మెచ్చుకున్నారు. మహాకుంభమేళా సాంప్రదాయం, సాంకేతికత, వాణిజ్యం, ఆధ్యాత్మికతల కలయిక అని తెలిపారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమవారం ‘ఇన్ సైట్స్ ఫ్రం ద వరల్డ్స్ లారెస్ట్ స్పిరిట్యువల్ గ్యాదరింగ్ పేరిట చర్చా కార్యక్రమాన్ని నిర్వహించ గా ఇందులో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

వారు తమ అనుభవాలను గురించి ఈ చర్చా కార్యక్రమంలో వివరిం చారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ తరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. ‘మేళాలో ఉపయోగించిన సాంకేతికత, అక్కడి సాంప్రదాయం పట్ల నేను ఆకర్షితుడనయ్యాను. సమాజం అభివృద్ధి చెందిన తీరు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. 2025 మహాకుంభ్ అనేది స్వచ్ఛ్ కుంభ్.. చాలా శుభ్రం గా ఉంది.

మేళాలో ఉపయోగించిన డిజిటలైజేషన్ పద్ధతులు అభినందనీయం. ఈ పద్ధతులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి’. అని అన్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్  అసిస్టెంట్ ప్రొఫెసర్ జుజుల్ మాట్లాడుతూ.. ‘2013లో మొదటిసారి భారత్‌కు వచ్చాను. 2037లో జరిగే కుంభమేళాకు రావాలని ఆశిస్తున్నా. వాణిజ్యం, ఆధ్మాత్మికత విషయాల గురించి మరింత తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నా. ప్రభుత్వానికి ఇది చాలా ముఖ్యమైనది.’ అని పేర్కొన్నారు. 

గంగమ్మ ఎప్పటికీ కలుషితం కాదు

గంగానది ఎప్పటికీ కలుషితం కాదని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. గంగలో ఎంత మంది భక్తులు మునిగినా కలుషితం కాదని పేర్కొన్నారు. ఇటీవల గంగా నదిలో ప్రమాదకర కోలీఫామ్ బ్యాక్టీరియాను గుర్తించారు. ఈ విషయంపై కూడా రవిశంకర్ స్పందించారు. ‘ఇన్ని కోట్ల మంది భక్తులను నడిపించే శక్తులుగా నాకు మూడు విషయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. శాస్త్రవేత్తలు నీటిలో ప్రయోగాలు చేసి గంగ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుమతించదని చెప్పారు. గంగమ్మ స్వీయ శుద్ధీకరణ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది’. అని రవిశంకర్ పేర్కొన్నారు. 

పారిశుద్ధ్య కార్మికులతో సీఎం భోజనం

ప్రయాగ్‌రాజ్‌లోని అరైల్ ఘాట్ వద్ద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు చేశా రు. బోటులో పయనించి.. గంగా హారతిలో పా ల్గొన్నారు. ఆ తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతే కాకుండా మహాకుంభ్‌లో పాల్గొన్న శానిటేషన్, హెల్త్ వర్కర్లకు రూ. 10 వేల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. బు ధవారంతో ముగిసిన మహాకుంభమేళాలో 67 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానమాచరించారు.    

అసౌకర్యం కలిగితే క్షమించండి: ప్రధాని నరేంద్ర మోదీ

కుంభమేళా విశేషాలను ప్రధాని మోదీ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ‘ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం ఆషామాషీ కాదు. అంచనాలకు మించి జనం వచ్చి పుణ్యస్నానం ఆచరించారు. ఇండియా కొత్త శక్తితో ముందుకు సాగుతోంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని దేనితోనూ పోల్చలేం. సంగమానికి వచ్చిన భక్తులను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అధికారిక ఆహ్వానాలు పంపకపోయినా భక్తులంతా స్వతహాగా తరలివచ్చారు.

చిన్న వారి నుంచి పండు ముసలివాళ్ల వరకు మేళాకు వచ్చారు. ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంది. మేళాను విజయవంతంగా ముగించిన యూపీ ప్రభుత్వానికి సహకరించిన ప్రయాగ్‌రాజ్ ప్రజలు, భక్తులకు ధన్యవాదాలు. ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి.’ అని ప్రధాని రాసుకొచ్చారు. 45 రోజుల పాటు సాగిన మహాకుం భమేళాలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరులు పుణ్యస్నానం ఆచరించారు.