calender_icon.png 16 November, 2024 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒట్లు తీసి గట్టుమీద పెట్టిన సీఎం

04-11-2024 12:32:43 AM

  1. కేసీఆర్‌ను మించిపోయిన రేవంత్‌రెడ్డి 
  2. రైతులకు ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్
  3. రూ.500 బోనస్‌ను రైతులకు ఇవ్వాలి
  4. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

కామారెడ్డి(నిజామాబాద్), నవంబర్ 3 (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో ఒట్లు వేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ ఒట్లు గట్టుమీద పెట్టేశారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆచరణ సాధ్యంకానీ హమీలను ఇవ్వడంలో రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను మించిపోయాడన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చి న హమీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా దేవుళ్లపై ఒట్టు వేసి ప్రజలను మోసం చేశారన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

పంట కోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించ డం లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో 468 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 40 కేంద్రాలు ఏర్పాటు చేసి వదిలేశారన్నారు. సమస్యల పరిష్కారం కోసం బోధన్ ఎమ్మె ల్యే దగ్గరకు ప్రజలు వెళ్తే మంత్రి అయ్యే వరకు తన వద్దకు రావద్దని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు.

కాగా ఎంఐఎం దేశానికి పట్టిన క్యాన్సర్ అని, కాంగ్రెస్ తెచ్చి న వక్ఫ్‌బోర్డు చట్టం ఎంతో ప్రమాదకరమైందన్నారు. ఇలాంటి చట్టాలను వెంటనే తొల గించాల్సిన అవసరం ఉందన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడం సిగ్గు చేటైన విషయమని అరవింద్ అన్నారు. వారి హయాం లోనే రూ.2,600 కోట్లతో ప్రాజెక్ట్ పనులు చేపడుతామని చెప్పి కనీసం సర్వే డిజైన్ చేయకుండానే నిధులు మంజూరు చేశారన్నారు.

ఇప్పుడు దానిపై పాదయాత్ర చేస్తాన నడం కేటీఆర్‌కు తగదన్నారు. అనంతరం బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ నుంచి తీసుకున్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానారాయణగుప్తా, మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి పాల్గొన్నారు.