calender_icon.png 27 December, 2024 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్చువల్ పద్ధతిలో కామారెడ్డి పారామెడికల్ ను ప్రారంభించిన సీఎం

02-12-2024 10:52:21 PM

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లా అధికారులు

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం ఆరోగ్య ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. కామారెడ్డి మెడికల్ కళాశాలలో పారామెడికల్ కళాశాలను వర్చువల్ పద్ధతిలో సీఎం ప్రారంభంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి విక్టర్ కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ శివ ప్రసాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పారా మెడికల్ కళాశాలను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు మెడికల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.