ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
యాదాద్రిభువనగిరి, నవంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 8న యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు సమాచారం అందడంతో ఆయన పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
అదేరోజు సీఎం పుట్టినరోజు కావడంతో ఆయన మొదట యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే విధంగా రూ.200 కోట్లతో ఏర్పాటు చేయనున్న మిషన్ భగీరథతాగునీటి రిజర్వాయ ర్‌కు శంకుస్తాపన చేస్తారు. అనంతరం ఆయ న జిల్లాలోని మూసీ పరీవాహకం వెంట పర్యటించనున్నారు.
వలిగొండ మండలం నాగారం వద్ద గల అసిఫ్‌నగర్ కాల్వ కత్వ నుంచి రామన్నపేట మండలం తుమ్మల గూడెం చెరువు వరకు పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ విప్ బీర్లఅయిలయ్య, ఆర్‌అండ్‌బీ ఆర్‌డబ్లూ ఎస్ అధికారులు యాదగిరిగుట్టలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
యాదాద్రి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు పాదయాత్ర ప్రాంతాన్ని పరిశీలించారు. మార్గమ ధ్యన మూసీ వంతెనలను పరిశీలించారు. ఈ మార్గంలోనే సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సివుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.