23-02-2025 05:42:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సోమవారం పర్యటన చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ రద్దు అయినట్టు డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు తెలిపారు. ఈనెల 27న నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్మల్ లో ఆత్మీయ సమ్మేళనం రావాల్సి ఉన్న చివరి క్షణంలో రద్దు అయినట్టు ఆయన తెలిపారు. మంచిర్యాలలో సీఎం పర్యటన ఉంటుందని ఆయన వివరించారు.