calender_icon.png 12 March, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

12-03-2025 12:00:00 AM

స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జనగామ, మార్చి 11(విజయక్రాంతి): ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానున్నారని, ఆ పర్యటనను విజయ వంతం చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మె ల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు సంబంధిత పనులను పూర్తిచేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రూట్ ల వారీగా పార్కింగ్, రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. అలాగే సభా స్థలి వద్ద మహిళా పోలీస్ సిబ్బందిని ఎక్కువ మొత్తంలో నియమించాలన్నారు.

పార్కింగ్ వద్ద, సభా స్థలికి కొంచెం దూరంలో తాగునీటి వసతి, తాత్కాలిక మూత్రశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు. శంకుస్థాపనలు చేసే చోట షామియానా, తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. రూట్ మ్యాప్స్ ఆధారంగా సూచిక బోర్డులను  నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకన్న, ఘనపూర్ (స్టేషన్) మునిసిపల్ కమిషనర్ రవీందర్, ఏసీపీ భీం శర్మ, పీడీ డీఆర్డీవో వసంత, డీఎంహెచ్‌వో మల్లికార్జునరావు, డీపీవో స్వరూప, హౌసింగ్ పీడీ మాతృనాయక్, విద్యుత్ ఎస్‌ఈ వేణుమాధవ్  తదితరులు పాల్గొన్నారు.