హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): పలు టీచర్ సంఘాల నూతన డైరీలను సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సచివాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్), స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) డైరీలను వేర్వేరుగా సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి టీచర్ సంఘాల నేతలు తీసుకెళ్లినట్టు తెలిపారు.
డైరీ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి, నాయకులు సుంకిశీల ప్రభాకర్‌రావు, ఎం ప్రణీత్‌కుమార్, ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, నాయకులు ఏవీ సుధాకర్, జుట్లు గజేందర్ తదితరులు పాల్గొన్నారు.