30-03-2025 01:07:09 AM
హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): గల్ఫ్ కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గల్ఫ్ భరోసాకు సంబంధించి ప్రవాసీమిత్ర సంస్థ రూపొందించిన పోస్టర్, డాక్యుమెంటరీని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం తన నివాసంలో ఆవిష్కరించారు. గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కార్యక్రమంలో ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, ప్రవాసీమిత్ర ప్రతినిధులు మంద భీమ్‌రెడ్డి, పీ సునీల్‌కుమార్ రెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్‌రావు, పీఎల్‌కే రెడ్డి, కల్యాణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.