08-03-2025 12:37:34 AM
హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను తేల్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శనివారం హస్తినకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మరో కొందరు సీనియర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు.
పార్టీ అధిష్ఠా నం పెద్దలతో చర్చించి ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలపై తుదినిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 10వ తేదీకి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో 9వ తేదీన అభ్యర్థులను ప్రకటించను న్నారు. రాష్ట్రంలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ నాలుగింటి లో విజయం సాధించే అవకాశం ఉంది.
ఎన్నికల ముందు పొత్తులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు సీపీఐకి ఒకటి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌ను కోరుతున్నా రు. ఈ విషయం అధిష్ఠానం నిర్ణయం మేర కు నడుచుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఎ మ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ సీటు కోసం పదు ల సంఖ్యలో ఆశావాహులు పోటీపడుతున్నా రు.
ఎస్సీ, బీసీ, ఓసీతో పాటు ఎస్టీకి ఇవ్వా లా..? మైనార్టీ వర్గానికి ఇవ్వాలా..? అనేది శనివారం ఢిల్లీ పెద్దలతో జరిగే సమావేశంలో ని ర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ చీఫ్‌విప్ పదవుల భర్తీలో ఆయా సామాజిక వర్గాలకు లభించే ప్రాధాన్యాన్ని బట్టి.. ఎమ్మెల్సీల అభ్యర్థిత్వాలపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
పోటీలో వీరు..
ఓసీ సామాజిక వర్గం నుంచి సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, జెట్టి కుసుమకు మార్, సామా రామ్మోహన్‌రెడ్డితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహే శ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్, చరణ్‌కౌశిక్ యాదవ్‌తో పాటు మరి కొందరు ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీల నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, శంకర్‌నాయక్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన విజయబాయి పేర్లు వినిపిస్తున్నాయి. మైనార్టీల నుంచి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్ తదితరులు ఆశిస్తున్నారు.