calender_icon.png 22 February, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం భేటీ

22-02-2025 12:31:28 AM

పీసీసీ చీఫ్‌తో కలిసి ప్రజాభవన్‌లో సమావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కులగణనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.

అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌లో సమావేశం కానున్నారు.

సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టం కోసం తీర్మానం చేయడంలాంటి అంశాలపై చర్చించనున్నారు.   కులగణన బిల్లును కేంద్రానికి పంపి బీజేపీని ఇరకాటంలో పెట్టాలనే ఆలోచనపై పార్టీ శ్రేణులతో చర్చ పెట్టనున్నారు.