ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్/సిరిసిల్ల, నవంబర్ 16 (విజయక్రాంతి): ఈ నెల 25న సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 25న కరీంనగర్లో నిర్వహించే సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం బహిరంగ సభకు పలుచోట్ల స్థలాలను పరిశీలించింది. అంబేద్కర్ స్టేడియం, ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానం సహా పలుచోట్ల స్థలాలను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం పరిశీలించారు.
హన్మకొండ పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్‌తో మాట్లాడి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని ఆదేశిం చారు. ఈ నెల 20న వేములవాడలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సీఎం వస్తుండగా.. పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ శనివారం పరిశీలించారు.
పట్టణంలో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణంతో పాటు హెలీప్యాడ్‌ను పరిశీలించారు. సీఎం పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవో వినోద్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.