calender_icon.png 16 March, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సార్ చాలాబాగా మాట్లాడారు!

16-03-2025 12:58:23 AM

రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపిన సభ్యులు

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి శనివారం సభలో మాట్లాడిన తీరు సభలో ఉన్నవారందరినీ ఆకట్టుకుంది. గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదాలు తెలిపే ప్రతిపాదనపై సీఎం సుధీర్ఘంగా మాట్లాడారు. చా లా బాగా మాట్లాడారని సీఎంకు ఎమ్మెల్యేలు కితాబిచ్చారు.

ఏకధాటిగా దాదా పు రెండున్నర గంటలు వివిధ అం శాలపై, కూలంకషంగా మాట్లాడి సభ్యు లను ఆకట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లి షేక్ హ్యాం డ్ ఇచ్చి అభినందనలు తెలిపారు.  బీఆర్‌ఎస్ పదేళ్ల పరిపాలనలో ఏం చేసిం దో...పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభు త్వం చేసిన అభివృద్ధి గురించి వివరించిన తీరు, అధికార పక్షం, ప్రతిపక్షం పాత్ర,  ప్రస్తుత రాజకీయాల పరిస్థితి, రాష్ట్ర అప్పులపై సీఎం మాట్లాడారు.