calender_icon.png 12 March, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సైలో బంకర్ కాలుష్యంపై సీఎం తక్షణమే స్పందించాలి

12-03-2025 12:52:04 AM

 మీడియాతో బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి

సత్తుపల్లి, మార్చి 11(విజయక్రాంతి): సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ నగర్ వాసులు సింగరేణి సైలో బంకర్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని,నిబంధనలను ఉల్లంఘిస్తూ గ్రామానికి అతి సమీపంలో నిర్మించిన ఈ సైలో బంకర్ నుండి వెలువడే దుమ్ము, ధూళి ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం పై రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  తక్షణమే స్పందించి, సమస్యను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల సహ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం ఇక్కడ అయన మీడియా తో మాట్లాడారు. ఈ సమస్యను ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్  దృష్టికి తీసుకెళ్లామని, బాధితుల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు బీజేపీ వారి వెంట ఉంటుందని, త్వరలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని సైతం ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. పభుత్వం స్పందించకపోతే బాధితుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 15 ఏళ్లుగా సింగరేణిలో నియామకాలు, కాంట్రాక్టులు, నిధుల వినియోగం వంటి అంశాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని కోరారు.