calender_icon.png 19 January, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంట్రాక్టు కార్మికులకు సీఎం పిఎఫ్ డబ్బులను చెల్లించాలి

18-01-2025 05:42:46 PM

ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు భోగే ఉపేందర్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల కు రావలసిన సీఎం పిఎఫ్ డబ్బులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో పర్సనల్ మేనేజర్ రెడ్డి మల్ల తిరుపతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ బెల్లంపల్లి ఏరియాలో కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహించి అనంతరం అనివార్య కారణాల వల్ల పని మానుకున్న కార్మికుల చాలామంది ఉన్నారన్నారు. సీఎం పిఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు.

కార్మికులు అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోకపోవడంతో పాటు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని దీంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే సీఎం పిఎఫ్ డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్ గౌడ్, జంపయ్య, దుర్గయ్య తదితరులున్నారు.