calender_icon.png 24 February, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సభను విజయవంతం చేయాలి

24-02-2025 12:41:12 AM

 డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు 

చింతలమానపల్లి, ఫిబ్రవరి23( విజయ క్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాలలో నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు కోరారు. ఆదివారం ఎమ్మెల్సీ దండే విఠల్ తో కలసి మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఇందులో భాగంగానే జాబ్ క్యాలెండర్ రూపొందించి ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. మంచిర్యాలలో 24న చేపట్టే సభకు పట్టభద్రులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీడం గణపతి, నాయకులు  పాల్గొన్నారు.