calender_icon.png 25 September, 2024 | 4:03 AM

మెడికల్ ప్రవేశాలపై సీఎం మొద్దు నిద్ర వీడాలి

25-09-2024 01:53:36 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ వైద్య విద్య ప్రవేశాలు చేసేదెప్పుడని, గడువు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి మొద్దు నీద్ర వీడి ప్రక్రియ ప్రారంభించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సూచించారు. మంగళవారం ఎక్స్‌వేదిక స్పందిస్తూ..

గత పదేళ్లు ప్రశాంతంగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ ఆడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చిన తొలి ఏడాదే అస్థవ్యస్థంగా మార్చేసి గందరగోళం సృష్టిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 33 జీవోతోనే ఈ సమస్యంతా వచ్చిందని, అనవసరం జీవో తెచ్చి అడ్మిషన్ల ప్రక్రియను ఆగం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇతర రాష్ట్రాల్లో మెడికల్ ఆడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరినా తెలంగాణలో కనీసం ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదం డ్రుల్లో నెలకొన్న ఆందోళనకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరితో ఒక విద్యార్ధికి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.