13-02-2025 02:07:43 AM
ప్రభుత్వానికి టీఎన్జీవో నేతల విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ఉద్యోగ పెండింగ్ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే దృష్టి సారించాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, ప్రధానకార్యదర్శి హుస్సేనీ ముజీబ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ‘ప్రభుత్వం మీద తమకు పూర్తి నమ్మకముంది.
ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులుగా వారి బాధ్యతలు, ఒత్తిళు ఏ మేరకు ఉంటాయో తెలుసు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి’ అని కోరారు.
గతేడాది అక్టోబ ర్‌లో ఉద్యోగ జేఏసీ నాయకత్వాన్ని పిలిపించి సమస్యలన్నీ విన్నారని, ఈ మార్చి కల్లా వాటిని పరిష్కరిస్తామ ని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కోశాధికారి రామినేని శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.