- సీఎం నిరుద్యోగులతో చర్చించాలి
- యువజన విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): సీఎం కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలతో కాకుండా అసలైన నిరుద్యోగులతో చర్చించాలని వామపక్ష యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ నాయకులు డిమాండ్ చేశారు. శని వారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ.. హాస్టల్ వార్డెన్ పరీక్షలు ముగిసిన కొద్ది రోజులకే డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు ఉన్నందున ప్రిపరేషన్‌కు సమయం సరిపోదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేసి, ప్రిపరేషన్‌కు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి అసలైన నిరుద్యోగులతో మాట్లాడాలని, కాంగ్రెస్ అనుబంధ యువజన, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడితే సమస్య కొలిక్కి రాదన్నారు. ఆయా పోటీ పరీక్షల్లో పోస్టులను పెంచాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీవైఎ ల్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వలి ఉల్లా ఖాద్రీ, ధర్మేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, నాగరాజు, పీడీఎస్‌యూ జాతీయ నేత నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, పీవైఎల్ నాయకుడు హరీష్ పాల్గొన్నారు.