హైదరాబాద్: అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలను అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆడబిడ్డలందరికీ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను నమ్మితే నట్టేట మునుగుతారనేలా సీఎం మాట్లాడటం శోచనీయమని, సీఎం పదవిలో కూర్చొనేందుకు రేవంత్ రెడ్డి అనర్హుడు అని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలి.. ఆడపడచులకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించానని అభ్యంతరం వస్తే విచారం వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు, ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లని కేటీఆర్ చెప్పారు. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉపముఖ్యమంత్రి అనడం అన్యాయం, ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నించారు. మేము పదేళ్లు అధికారంలో ఉన్న ఏ రోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా..? అసెంబ్లీలో ఇవాళ మా ఆడబిడ్డలకు జరిగిన అవమానం మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానమని కేటీఆర్ తెలిపారు.