calender_icon.png 11 February, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం, షబ్బీర్ అలీ చిత్రపటాలకు క్షీరాభిషేకం

10-02-2025 01:45:09 AM

కామారెడ్డి , ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) : భిక్కనూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ,ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు .కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదనీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 46% రిజర్వేషన్లు కల్పించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకు మండల బీసీ సంఘాలు ఎంతో రుణపడి ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తిరుపతి, భీమ్ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, బిక్కనూర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు తిరుమల స్వామి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.