21-02-2025 12:53:36 AM
పూర్వాపరాలపై ముఖ్యమంత్రి ఆరా
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై కోర్టును ఆశ్రయిం చిన భూపాలపల్లి తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యా ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. గురువారం సీఎం పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కేసు పూర్వాపరాలపై ఆరా తీశారు.
హత్య కేసును ఛేదించేందుకు సీఐడీ విచారణకు సీఎం ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగుబా టుపై 2023లో రాజలింగమూర్తి న్యాయపోరాటా నికి దిగారు. ఆయన కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు కోర్టు నాటి మంత్రులు కేసీఆర్, హరీశ్ రావుతో పాటు పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థకు నోటీసులు జారీచేసింది.
కేసు కోర్టులో కొనసా గుతుండగానే, బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి అనూహ్యం గా హత్యకు గురయ్యారు. గుర్తుతెలియ ని దుండగలు ఆయన్ను కత్తులతో పొడిచి కిరాతకంగా హతమార్చారు. హత్యపై భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు రాజలింగమూర్తి హత్యను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావుతో పాటు ఇతర నేతలూ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.
హత్య వెనుక వారి హస్తం: మంత్రి కోమటిరెడ్డి
రాజలింగమూర్తి హత్యవెనుక మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులో కి వస్తాయన్నారు. రాజలింగమూర్తి హత్యను సీజే సుమోటోగా తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పరామర్శ
భూపాలపల్లిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి గురువారం ఉదయం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేరుకున్నారు. రాజలింగమూర్తి మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. హత్య కేసుపై ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలతో చర్చించినట్లు తెలిసింది.
నిందితులెవరైనా వదిలిపెట్టం: డీఎస్పీ సంపత్‌రావు
రాజాలింగమూర్తి హ త్య వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమని భూపాలపల్లి డీ ఎస్పీ సంపత్‌రావు తెలిపారు. హత్య కేసులో ఇంకా ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, భూతగాదాలతోపాటు ఇతర కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని స్పష్టం చేశారు.
హత్య వెనుక సుపారీ? ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ
మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త రాజలింగముర్తి హత్య సుపారీ ఉందని తాము అనుమానిస్తున్నామ ని, హత్యను కాంగ్రెస్ ఖండిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గురువారం ప్రకటిం చారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం హత్యను సీరియస్‌గా తీసుకుని దర్యా ప్తు చేయిస్తున్నదన్నారు.
ఆ బాధ్యతలను సీబీ సీఐడీకి అప్పగిస్తే బాగుం టుందన్నా రు. హత్యా రాజకీయాలు రాష్ట్రానికి ఎంతో చేటు చేస్తాయని అభిప్రాయపడ్డారు. దర్యాప్తు అధికారులు త్వరలో కేసును ఛేదిస్తారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.