calender_icon.png 17 January, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమీక్ష

16-07-2024 12:56:55 AM

9 అంశాలపై చర్చించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఉదయం 9.30 గంటలకు సమావేశం ప్రారంభం  

హైదరాబాద్, జులై 15 (విజయక్రాంతి): అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో  మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని ఏడో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరుకానున్నారు. 9 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించనున్నారు. ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, వైద్యం వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతిభద్రతలు, డ్రగ్స్ నిరోధానికి తీసుకునే చర్యలపై మాట్లాడనున్నారు. ఎజెండాలో పొందుపర్చిన వాటికి సంబంధించి పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే.