calender_icon.png 29 October, 2024 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌వి డైవర్షన్ పాలిటిక్స్

30-08-2024 01:46:31 AM

బీఆర్‌ఎస్ నేత వాసుదేవ రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని సామా న్య జనం చర్చించుకుంటున్నట్లు బీఆర్‌ఎస్ నేత కే వాసుదేవరెడ్డి  పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మా ట్లాడుతూ.. వారం రోజులుగా హైడ్రా కు సంబంధించిన చర్చే జరుగుతుందని, తాము హైడ్రాకు మేము వ్యతిరే కం కాదని, మిగతా విషయాలు కూడా సీఎం పట్టించుకోవాలని సూచించారు. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కేసీఆర్ హయాంలో గురుకులాల సంఖ్య వెయ్యి దాటిందని, కానీ, రేవంత్ ప్రభుత్వం గురుకుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిప డ్డారు.

ఇప్పటివరకు 38 మంది విద్యార్థులు గురుకులాల్లో వివిధ కారణాల తో చనిపోయారని, అయినా పరిస్థితు లు మారడం లేదన్నారు. సీఎం, మం త్రులకు చీమ కుట్టినట్టయినా లేదని, ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారని విమర్శించారు.  రేవంత్ నియోజకవర్గంలోనే ఉపాధ్యాయులు  లేక ప్రభు త్వ పాఠశాల మూతపడిందని, ఇంత కన్నా దారుణం ఉంటుందా అని నిలదీశారు. పాలన పూర్తిగా పడకేసింద న్నారు. సీఎం రేవంత్ గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని  దూదిమెట్ల బాలరాజుయాదవ్ ఆరోపించారు.  దుర్గం చెరువు పరిధిలో సీఎం సోదరుడి ఇల్లు ఉన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని, ముందు దాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు.