31-03-2025 01:24:21 AM
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరుగులు
పాలకుల్లో పెరగనున్న పోటీతత్వం
వర్షాలు బాగా కురుస్తాయ్
రవీంద్రభారతిలో సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రజలందరూ మెచ్చేలా సీఎం రేవంత్‌రెడ్డి పాలన ఉంటుదని పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకొని రవీంద్రభారతిలో పంచాగశ్రవణం చేశారు. ‘రాష్ట్రం ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుంది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు మంచికాలం. తెలంగాణ రాష్ట్రం మిథున రాశి, పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. పాలకుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటాపోటీగా పాలన సాగిస్తారు. వర్షాలు బాగా కురుస్తాయి. రైతులు ఆనందంగా ఉంటారు. బియ్యం కొరత ఏర్పడుతుంది. సీఎం తెలివితేటలతో ధన, ధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు. సోషల్ మీడియా ప్రజలను ఇబ్బం ది పెడుతుంది. ఎర్ర రేగడి భూముల, ఎర్రటి ధాన్యాలు మంచి ఫలితాలు ఇస్తాయి. శాంతి భద్రతల విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఆదివారం తెలంగాణ ప్రజ లు మాంసం, మందు ముట్టకుంటే అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు’ అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.