calender_icon.png 16 March, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్.. కేసీఆర్ చావును కోరుతున్నారు!

16-03-2025 01:00:56 AM

చిట్‌చాట్‌లో హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ చావును సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటుకున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన వ్యక్తిని దారుణంగా అవమానపరిచారని, అందుకే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బహిష్కరించినట్టు స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేశారు. మంత్రి ఉత్తమ్ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని, కృష్ణా జిలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కారణం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.

పోతిరెడ్డి పాడు కోసం పీజేఆర్ కొట్లాడితే.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  మాత్రం పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర కు వెళ్లి భోజనం చేసి వచ్చిన ఉత్తమ్ కృష్ణా నీటిలో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు.

ద్రోహ చరిత్ర ఉత్తమ్‌ది అయితే త్యాగ చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హుజూర్‌నగర్‌ను ముంపుకు గురిచేసి ఆంధ్రాలో మూడో పంటకు నీళ్లు ఇస్తే.. తాము పులిచింతల నిర్వాసితులకు వందల కోట్ల రూపాయలు ఇచ్చి కాపాడుకున్నట్లు గుర్తుచేశారు.