calender_icon.png 7 March, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జానారెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్

07-03-2025 01:56:32 AM

హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి ఇంటికి గు రువారం సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లారు. అరగంటకు పైగా జానారెడ్డితో సీఎం వివిధ అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఫలితాలు, క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

జానారెడ్డిని ప్రభుత్వ ముఖ్యసలహా దారుగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అడిగితే సలహాలు, సూచనలు అందిస్తానని బుధవారం జానారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వీరి భేటీపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.