గాంధీభవన్‌లో దివంగత నేత వర్ధంతి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాం తి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని సోమవా రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నివాళి అర్పించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నా రు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైఎస్ చిత్రపటానికి నివాళి అర్పించారు. గాంధీభవన్‌లోనూ వైఎస్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు పంజాగుట్టలో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.