హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం విజయవాడకు వెళ్లనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి విజయవాడకు వెళ్తుండగా.. పార్టీ నేతలు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్ర దేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు హాజరు కానున్నారు.